అగ్ని-4 పరీక్ష విజయవంతం..

- January 02, 2017 , by Maagulf
అగ్ని-4 పరీక్ష విజయవంతం..

భారత్‌ క్షిపణి కార్యక్రమంలో మరో ముందడుగు పడింది. అగ్ని-5 పరీక్షను విజయవంతంగా నిర్వహించిన వారం తర్వాత అగ్ని-4ను శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఒడిశాలోని బాలాసోర్‌ పరీక్షా కేంద్రంలో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ క్షిపణిలో రెండు రకాలు ఉన్నాయి. ఉపరితలం మీద నుంచి ఉపరితలంపైకి ప్రయోగించేది 20 మీటర్ల పొడవు, 17టన్నుల బరువు ఉంది. ఇది దాదాపు నాలుగువేల కిలోమీటర్ల దూరం వరకు టన్ను బరువైన వార్‌హెడ్‌ను మోసుకువెళుతుంది. అగ్ని-4కు నిర్వహించిన పరీక్షల్లో ఇది నాలుగోది. ఈ క్షిపణిని డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది. త్రివిధ దళాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని దీనిని అభివృద్ధి చేశారు.

ఈ ఐదేళ్లలో నిర్వహించిన అగ్ని-4 ప్రయోగాల్లో ఒక్కటి మాత్రమే విఫలమైంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com