అతడో కొత్త రకం

- January 04, 2017 , by Maagulf
అతడో కొత్త రకం

సా యిరామ్‌ శంకర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'నేనో రకం'. రేష్మిమేనన్‌ కథానాయిక. శరత్‌కుమార్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. సుదర్శన్‌ సలేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్‌ రెడ్డి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

త్వరలోనే పాటల్ని విడుదల చేస్తారు. దర్శకుడు మాట్లాడుతూ ''నవతరం అభిరులకి తగ్గట్టుగా రూపొందుతున్న చిత్రమిది. సమాజంలో జరుగుతున్న సంఘటనల్ని స్ఫూర్తిగా తీసుకొని అందరినీ థ్రిల్‌కి గురిచేసేలా చిత్రాన్ని సిద్ధం చేస్తున్నాం. సాయిరామ్‌శంకర్‌, శరత్‌కుమార్‌ల మధ్య సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి'' అన్నారు.

''కొత్త రకమైన కథ, కథనాలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు, తమిళంలోనూ విడుదల చేస్తామ''న్నారు నిర్మాత. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సిద్ధార్థ్‌, సంగీతం: మహిత్‌ నారాయణ్‌

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com