సమాధానం లేని ప్రశ్న

- September 10, 2015 , by Maagulf
సమాధానం లేని ప్రశ్న

అభం శుభం తెలియని మనుషులను ప్రేమ పేరుతో 

వంచించి మనసుని చిదిమేసే మోసకారులను 

అకస్మిక దాడులు చేసి ఆడవారి శీలాన్ని దోచి వారిని 
క్రూరంగా  అంతమొందించే మానవ మృగాల్ని 

మతాల ముసుగులో మారణ హోమం సృష్టించే 
నర రూప రాక్షసులని 

ప్రకృతి వనరుల్ని కొల్లగొడుతూ ప్రళయాలకు
కారకులయ్యే మూడులను 

ఇంకా ఈ లోకం లోని సర్వ విధాల పాపాత్ములను 
లెక్కలు కట్టి 

వారికి, ఓ నివేదిక సమర్పించనా? ఏంటిరా చిట్టి... 

నువ్వడిగిన ఆ ప్రశ్న "బాబాయ్ మీరు విమానం లో 
వెళతారు కదా మరి మీకు ఆ దేవుళ్ళు కనిపించరా? "అని 

అనే దానికే గనక, సరి అయినా సమాధానం దొరికి 
నీ ఆలోచనే నిజమైతే, 
ఈ లోకం లోని కుళ్ళు అంతా రూపు మాపమని,

ఒక్కక్కరే వెళ్ళి పోతున్న మంచివాళ్ళని చిరంజీవులుగా మలచి, 

లోక కంటకుల శుభ్రంగా.. ఊడ్చుకు వెళ్ళమని, 
కాళ్ళ వేళ్ళ పడి వేడుకోనా తల్లీ ...  
నువ్వనుకునే  ఆ దేవతలే నాకు ఎదురు పడితే ! 

--జయ రెడ్డి బోడ(అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com