మరో రికార్డు సృష్టించిన నాసా వ్యోమగాములు.!
- January 07, 2017
నాసా వ్యోమగాములు మరో రికార్డు సృష్టించారు. అంతరిక్షంలో ఏకదాటిగా ఆరు గంటలకుపైగా నడిచారు. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం వెలుపల కొత్త టవర్లను విజయవంతంగా ఏర్పాటు చేశారు. ఇప్పటి దాకా అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో నికెల్-హైడ్రోజన్ బ్యాటరీలను వినియోగించేవారు. సోలార్ ప్యానెళ్లతో ఉత్పత్తి చేసిన విద్యుత్తును ఆ బ్యాటరీల్లో నిల్వ చేసేవారు. వాటి స్థానంలో తక్కువ పరిమాణం.. అధిక సామర్థ్యం కలిగి ఉండే లిథియం-అయాన్ బ్యాటరీలను ఏర్పాటు చేసేందుకు ఏడాదిగా కసరత్తులు చేసిన నాసా.. తాజాగా ఆ ప్రక్రియను పూర్తి చేసింది. ఇద్దరు వ్యోమగాములు కలిసి శనివారం ఆరు లిథియం-అయాన్ బ్యాటరీలను అమర్చారు. కొత్త కనెక్షన్లు ఏర్పాటు చేశారు. ఈ సాహస ప్రక్రియలో కమాండర్ షేన్ కిమ్‌బ్రాగ్.. ఫ్లైట్ ఇంజినీర్ పెగ్గీ విట్సన్ పాల్గొన్నారు. జనవరి 13న కిమ్‌బ్రాగ్‌తోపాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఫ్లైట్ ఇంజినీర్ థామస్ పెస్క్వెట్ కలిసి మరోమారు స్పేస్‌వాక్ చేయనున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్‌లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!
- మస్కట్‌లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!
- బహ్రెయిన్ తేవర్ పెరవై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!
- బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!







