ఫిజీలో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్‌పై 6.1 గా నమోదు

- January 14, 2017 , by Maagulf
ఫిజీలో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్‌పై 6.1 గా నమోదు

కొద్దిసేపటి క్రితం ఫిజీని భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్టు అమెరికా జియోలజికల్ సర్వే తెలిపింది. నదీకి ఈశాన్యంగా 152 కిలోమీటర్లు, రాజధాని సువాకు 238 కిలోమీటర్ల దూరంలో భూమికి పది కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించింది. కాగా ఇదే ప్రాంతంలో వారం క్రితం 7.2 తీవ్రతతో భూంకంపం సంభవించింది. తాజా భూకంపం కారణంగా సంభవించిన నష్టం వివరాలు తెలియరాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com