మళ్ళీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

- January 15, 2017 , by Maagulf
మళ్ళీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై రూ.0.42 పైసలు, డీజిల్‌పై 1.03 పైసల ధరను పెంచుతున్నట్లు ఆయిల్‌ కంపెనీలు ఆదివారం రాత్రి ప్రకటించాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి ధరలను సవరిస్తోన్న ఆయిల్‌ కంపెనీలు వరుసగా ఐదోసారి ధరలను పెంచాయి. పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.

తాజాగా పెరిగిన ధరలతో న్యూఢిల్లీలో ఒక లీటరు పెట్రోల్‌ ధర 70.66కు చేరుకోగా, డీజిల్‌ ధర 58.71పైసలకు చేరుకుంది. జనవరి 2వ తేదీన పెట్రోల్‌పై రూ.1.29, డీజిల్‌పై రూ.0.97 పైసల ధరను పెంచిన విషయం తెలిసిందే. ఆయిల్ ధరలు పెంచడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com