అధికారిక వాహనాల కోసం ఎం90 ఫ్యూయెల్
- January 15, 2017
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ (ఎంఓఎఫ్), అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలకు చెందిన వాహనాలు ఇకపై ఎం91 ఫ్యూయల్‌నే వాడాల్సిందిగా సూచించింది. ఫ్యూయల్ మార్కెటింగ్ కంపెనీస్ అయిన షెల్ ఒమన్, ఒమన్ ఆయిల్, అల్ మహా, హర్మజ్ ఎనర్జీ తదితర సంస్థలను సంప్రదించి, పాత ఫిలింగ్ కార్డ్స్‌ని కొత్తవాటితో రీప్లేస్ చేయాల్సిందిగా మినిస్ట్రీ సూచించింది. ప్రతి వాహనానికీ ఫ్యూయల్‌ని ఫిల్ చేసేటప్పుడు, ఆ వాహనం నంబర్ రిజిస్టర్ అయ్యేలా ఈ కార్డ్స్‌ని రూపొందించారు. ఎం95 ఫ్యూయల్‌ని కొన్ని ప్రత్యేక వాహనాలకు మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంఓఎఫ్ వెల్లడించింది. వాహన తయారీదారులు, లేదా స్థానిక ఏజెంట్ రాతపూర్వకమైన పర్మిషన్ ఇచ్చిన వాహనాలకు మాత్రమే దీన్ని వినియోగిస్తారు. ఫైనాన్షియల్ సర్క్యులర్ ద్వారా దీనికి సంబంధించిన ఆదేశాల్ని మినిస్ట్రీ జారీ చేసింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









