ప్రైసింగ్‌ స్కాండల్‌పై కొనసాగుతున్న విచారణ

- January 16, 2017 , by Maagulf
ప్రైసింగ్‌ స్కాండల్‌పై కొనసాగుతున్న విచారణ

మనామా: నిర్ధారిత ధరలకన్నా అధిక ధరలకు వస్తువుల్ని విక్రయిస్తున్న ఓ షాపింగ్‌ ఔట్‌లెట్‌పై విచారణ కొనసాగుతున్నట్లు ప్రాసిక్యూటర్‌ మొహమ్మద్‌ అబ్దుల్లా చెప్పారు. కన్స్యూమర్‌ ప్రొటెక్షన్‌ డైరెక్టరేట్‌ - మినిస్ట్రీ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ కామర్స్‌ అండ్‌ టూరిజం ఈ కేసుని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి రిఫర్‌ చేసింది. విచారణలో షాపింగ్‌ ఔట్‌లెట్‌ అక్రమాలకు పాల్పడిందని తేలితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడ్తాయి. పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌, ఆరోపణలు ఎదుర్కొంటున్న షాపింగ్‌ ఔట్‌లెట్‌ నిర్వాహకులకు సమన్లు పంపింది. బిల్లులు మరియు రిసీప్ట్‌లను అందజేయాల్సిందిగా ఈ సమన్లలో పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com