దుబాయ్‌ ట్యాక్సీ స్మార్ట్‌ కార్‌ రికవరీ ప్రాజెక్ట్‌

- January 16, 2017 , by Maagulf
దుబాయ్‌ ట్యాక్సీ స్మార్ట్‌ కార్‌ రికవరీ ప్రాజెక్ట్‌

ఆర్‌టిఎ - దుబాయ్‌ ట్యాక్సీ కార్పొరేషన్‌ (డిటిసి), అరేబియన్‌ ఆటోమొబైల్‌ అసోసియేషన్‌ (ఎఎఎ)తో కలిసి ఓ ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది. స్మార్ట్‌ కార్‌ రికవరీ సిస్టమ్‌ కోసం రోడ్‌సైడ్‌ సర్వీసెస్‌ని అందించడంలో ఎఎఎ సంస్థ మేటి. ఈ ఒప్పందం ప్రకారం స్మార్ట్‌ కార్‌ రికవరీ సిస్టమ్‌ ఈ మార్చ్‌లో ప్రారంభమవుతుంది. మార్గమధ్యంలో వాహనానికి సమస్య తలెత్తితే, స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌ ద్వారానే 'సర్వీస్‌' పొందడానికి వీలవుతుందని డిటిసి, ఎఎఎ వర్గాలు వెల్లడించాయి. ఆర్‌టిఎ హెడ్‌ ఆఫీస్‌లో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో డిటిసి సిఇఓ డాక్టర్‌ యూసఫ్‌ మొహమ్మద్‌, అలాగే ఎఎఎ ఛైర్మన్‌ మొహమ్మద్‌ బిన్‌ సులేయెమ్‌ పాల్గొని, ఒప్పందాలపై సంతకాలు చేశారు. 10 లీటర్ల వరకు ఫ్యూయెల్‌ని అందించడం, టైర్‌ రిపెయిర్‌, సాధారణ మెకానికల్‌ సమస్యలు, టెక్నికల్‌ వర్క్‌ షాప్‌ వద్దకు వాహనాల్ని తరలించడం వంటివి ఈ అసిస్టెన్స్‌ ద్వారా వాహనదారులకు లభిస్తాయి. ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వాహనదారులు కూడా అభిప్రాయపడుతుండడం జరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com