గల్ఫ్‌ నుంచి 100 కిలోల బంగారం తరలించిన అయూబ్‌

- January 17, 2017 , by Maagulf
గల్ఫ్‌ నుంచి 100 కిలోల బంగారం తరలించిన అయూబ్‌

గ్యాంగ్‌స్టర్‌ అయూబ్‌ఖాన్‌ నకిలీ పాస్‌పోర్టు కేసులో నలుగురు నిందితులను దక్షిణ మండల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్టు దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ చెప్పారు. వీరి నుంచి నకిలీ నిఖా నామా పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పాస్‌పోర్టు ఏజెంట్‌ మొహమ్మద్‌ ఖలీల్‌ అహ్మద్‌ రూ.లక్ష తీసుకుని ఇద్దరు ఖాజీల సహాయంతో పేర్లు మార్చి నిఖానామా ఓ న్యాయవాదితో అఫిడవిట్‌ నోటరీ చేయించి నకిలీ ఓటరు గుర్తింపు కార్డులను తయారు చేశాడు. పాస్‌పోర్టు గ్రాంటింగ్‌ ఆఫీసర్‌ వెంకట్‌ సహకారంతో పాస్‌పోర్టు పొందాడు. పోలీసులు రెండు సార్లు విచారణ జరిపించి అది తప్పుడు సమాచారమని పంపించినా ఆ అధికారి సహకారంతో పొందాడు.

అయూబ్‌ఖాన్‌ జైలులో ఉండగానే పాస్‌పోర్టు కార్యాలయానికి రాకుండా వచ్చినట్లుగా నమ్మించి పాస్‌పోర్టు పొందాడు. అయూబ్‌ఖాన్‌ 100 కిలోల బంగారం భారత్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. పాతబస్తీకి చెందిన 18మంది సాయంతో గల్ఫ్‌ నుంచి అయూబ్‌ ఇండియాకు బంగారం తరలించినట్లు పోలీసులు గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com