గల్ఫ్ నుంచి 100 కిలోల బంగారం తరలించిన అయూబ్
- January 17, 2017
గ్యాంగ్‌స్టర్ అయూబ్‌ఖాన్ నకిలీ పాస్‌పోర్టు కేసులో నలుగురు నిందితులను దక్షిణ మండల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్టు దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ చెప్పారు. వీరి నుంచి నకిలీ నిఖా నామా పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పాస్‌పోర్టు ఏజెంట్ మొహమ్మద్ ఖలీల్ అహ్మద్ రూ.లక్ష తీసుకుని ఇద్దరు ఖాజీల సహాయంతో పేర్లు మార్చి నిఖానామా ఓ న్యాయవాదితో అఫిడవిట్ నోటరీ చేయించి నకిలీ ఓటరు గుర్తింపు కార్డులను తయారు చేశాడు. పాస్‌పోర్టు గ్రాంటింగ్ ఆఫీసర్ వెంకట్ సహకారంతో పాస్‌పోర్టు పొందాడు. పోలీసులు రెండు సార్లు విచారణ జరిపించి అది తప్పుడు సమాచారమని పంపించినా ఆ అధికారి సహకారంతో పొందాడు.
అయూబ్‌ఖాన్ జైలులో ఉండగానే పాస్‌పోర్టు కార్యాలయానికి రాకుండా వచ్చినట్లుగా నమ్మించి పాస్‌పోర్టు పొందాడు. అయూబ్‌ఖాన్ 100 కిలోల బంగారం భారత్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. పాతబస్తీకి చెందిన 18మంది సాయంతో గల్ఫ్ నుంచి అయూబ్ ఇండియాకు బంగారం తరలించినట్లు పోలీసులు గుర్తించారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









