సాయం కోసం బహ్రెయిన్‌లో హౌస్‌మెయిడ్ ఎదురుచూపులు..
- January 18, 2017
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మెయిడ్, స్వదేశానికి వెళ్ళేందుకు తగిన ఆర్థిక వనరులు లేక, అనారోగ్యంతో బహ్రెయిన్‌లో తల్లడిల్లిపోతున్నారు. 32 ఏళ్ళ గుడివాడ కుమారి అనే మహిళ, కొండ్రు వెంకట్ అనే ఇండియన్ ఏజెంట్ ద్వారా బహ్రెయిన్‌కి చేరారు. ఎన్నో ఆశలతో బహ్రెయిన్‌కి చేరుకున్న కుమారికి, ఇక్కడి పరిస్థితులు అగమ్యగోచరంగా తయారవడంతో సమాచారాన్ని తన తల్లికి చేరవేశారు. దాంతో ఆమె తల్లి జయమ్మ, బహ్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీకి ఫిర్యాదు చేశారు. కుమారి యజమాని, ఆమె పాస్‌పోర్ట్‌ని, అలాగే డబ్బునీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, మేన్ పవర్ ఏజెన్సీ మాత్రం, డిపాచ్యూర్ కోసం ఏజెంట్ పర్మిషన్‌ని కోరుతోంది. అయితే ఏజెంట్ కొండ్రు వెంకట్ మాత్రమే అక్కడే ఆమె పనిచేయాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారు. లక్ష రూపాయల్ని చెల్లిస్తేగానీ తన కుమార్తెను స్వదేశానికి రానివ్వబోనని ఏజెంట్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు బాధితురాలి తల్లి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. భారతదేశానికి చెందిన ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి గుడివాడ కుమారి. ఆమెకు భర్త ఏడు కొండలు, ఇద్దర పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం కుమారి అచేతనావస్థలో తనకు సాయం చేసేవారి కోసం ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









