ఖతార్‌లో ఇండియన్‌ స్కూల్స్‌కి ఓవర్‌ ఫ్లో..

- January 18, 2017 , by Maagulf
ఖతార్‌లో ఇండియన్‌ స్కూల్స్‌కి ఓవర్‌ ఫ్లో..

ఖతార్‌లో ఇండియన్‌ స్కూల్స్‌లో అడ్మిషన్స్‌ సందర్భంగా ఓవర్‌ ఫ్లో సమస్య వెంటాడుతోంది. అందుబాటులో ఉన్న సీట్లకంటే చాలా ఎక్కువగా దరఖాస్తులు వస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు నిరాశ తప్పడంలేదు. కొన్ని స్కూల్స్‌, మినిస్ట్రీ నుంచి అదనపు సీట్లకు సంబంధించిన అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. 2017-18 అకడమిక్‌ ఇయర్‌ కోసం అడ్మిషన్లు ప్రారంభం కాగా, సీట్ల కోసం పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఎంఇఎస్‌ స్కూల్‌, ఇప్పటికే 8000 మంది స్టూడెంట్స్‌ని కలిగి ఉంది. అయితే ఆ స్కూల్‌ కెపాసిటీ కేవలం 5000 మాత్రమే. మిగతా ఇండియన్‌ స్కూల్స్‌ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నిబంధనలకు మించి విద్యార్థుల్ని కలిగి ఉంటే మినిస్ట్రీ నుంచి విద్యాసంస్థలు సమస్యలు ఎదుర్కోక తప్పదు. ప్రత్యేక పరిస్థితుల్లో ఆయా స్కూళ్ళు, మినిస్ట్రీ నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మినిస్ట్రీ నుంచి ప్రత్యేక అనుమతుల కోసం చాలా స్కూల్స్‌ ఎదురుచూస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com