ముసున్నహ్ ప్రమాదంలో ఐదుగురికి గాయాలు..

- January 18, 2017 , by Maagulf
ముసున్నహ్ ప్రమాదంలో ఐదుగురికి గాయాలు..

మంగళవారం మధ్యాహ్నం స్థానిక ముసున్నహ్ సమీపంలోని  ఒక పాఠశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ తో సహా నల్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. రాయల్ ఒమాన్ పోలీస్ ఉన్నతాధికారి ఈ ప్రమాదం గూర్చి మాట్లాడుతూ,వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ రోడ్డుపై  విన్యాసాలు ప్రదర్శిస్తూ ప్రయాణిస్తున్నాడని, అకస్మాత్తుగా 4 డబ్ల్యూడీ వాహనంపై ఆ డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని తెలిపారు.ఈ వాహనంలోని నల్గురు పాఠశాల విద్యార్థులతో ఈ వాహనం పల్టీ కొట్టి  ఒక స్థిరమైన వస్తువుని డీ కొని ఆగింది. ఈ ప్రమాదానికి కారణమైన గాయపడిన డ్రైవర్ ను అరెస్టు చేశారు. నల్గురు అబ్బాయిలకు  తీవ్ర గాయాల కావడంతో వారిని  ముసున్నహ్ లోని ఒక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com