ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ టోక్యోకు...

- January 21, 2017 , by Maagulf
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ టోక్యోకు...

హైదరాబాద్‌: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ శనివారం రాత్రి కొరియా పర్యటనను ముగించుకొని జపాన్‌ రాజధాని టోక్యోకు చేరారు. సియోల్‌ విమానాశ్రయంలో భారత రాయబారి దొరైస్వామి, ఇతర అధికారులు ఆయనకు వీడ్కోలు పలికారు. ఈ నెల 19 నుంచి కేటీఆర్‌ కొరియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. శనివారం ఆయన సియోల్‌లో వ్యర్థపదార్థాల శుద్ధి కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి నిపుణులు ఈ కేంద్రం నిర్వహణను వివరించారు. కేటీఆర్‌ మాట్లాడుతూ, తెలంగాణలోనూ ఇదే తరహా శుద్ధికేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.దీనికి దక్షిణ కొరియా నిపుణుల సాయం తీసుకుంటామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com