ప్రపంచంలోనే అత్యంత పొడవైన సైకిల్‌ ట్రాక్‌ను..

- January 22, 2017 , by Maagulf
ప్రపంచంలోనే అత్యంత పొడవైన సైకిల్‌ ట్రాక్‌ను..

హైదరాబాద్ : ప్రపంచంలోనే అత్యంత పొడవైన సైకిల్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేసే అవకాశం నగరంలో ఉందని తెలంగాణ ప్రభుత్వ హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, విజిలెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ త్రివేది అన్నారు. గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ బైస్ల్కి క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ది గ్రేటర్‌ హైదరాబాద్‌ సైక్లోథాన్‌-2ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజీవ్‌ మాట్లాడుతూ సైక్లింగ్‌పై ప్రజలు ఉత్సాహంగా ఉన్నప్పటికీ నగరంలోని రోడ్లు, పెరుగుతున్న ట్రాఫిక్‌ దృష్ట్యా సైక్లి్‌స్టలు అభద్రతా భావానికి లోనవుతున్నారని అన్నారు. ఈ రోడ్లపై సైకిల్‌ రైడ్‌ చేసేందుకు తానే అన్‌సేఫ్‌గా ఫీలవుతానని తెలిపారు. నగరం చుట్టూ ఉన్న ఔటర్‌ రింగురోడ్డు పక్కన 158 కిలోమీటర్ల మేర ప్రపంచంలోనే అతి పొడవైన సైకిల్‌ ట్రాక్‌ను నిర్మించుకోవచ్చునని వెల్లడించారు.
ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపడితే మంచిదని తెలిపారు. ఈ సైక్లోథాన్‌లో ఆరేళ్ల చిన్నారుల నుంచి 81 సంవత్సరాల వృద్ధుల వరకూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలిండియా బైస్ల్కింగ్‌ ఫెడరేషన్‌ బోర్డు చైర్మన్‌ డీవీ మనోహర్‌ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com