సీఎం కేసీఆర్ 30న తిరుమలకు...
- January 22, 2017
హైదరాబాద్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తిరుమల వేంకటేశ్వరస్వామిని, విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని కానుకలు సమర్పిస్తానని మొక్కుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. వాటిని తీర్చుకునేందుకు సమాయత్తమవుతున్నారు. ఇందుకు ఈనెల 30వ తేదీన ఆయన ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ముహూర్తంగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆరోజు ఉదయం ఆయన నేరుగా తిరుమలకు వెళ్లి స్వామిని దర్శించుకుని, తాను మొక్కుకున్నట్టుగా బంగారు సాలిగ్రామ హారం, ఐదు పేటల కంటె సమర్పించుకుంటారు. అక్కణ్నుంచీ బయల్దేరి విజయవాడకు చేరుకుని కనక దుర్గమ్మ దర్శనం చేసుకుని, బంగారు ముక్కుపుడక సమర్పించి మొక్కు తీర్చుకుంటారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం హారం, కంటె, ముక్కు పుడక సిద్ధం చేసింది. అనంతరం ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు ఆతిథ్యమిస్తారు. ఈ సందర్భంగా వారు పలు అంశాల మీద చర్చలు జరిపే అవకాశం ఉంది. కాగా, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే కానుకలు చెల్లిస్తానని మొక్కుకున్న కేసీఆర్.. ఇప్పటికే తెలంగాణలోని దేవుళ్లు, దేవతలకు మొక్కలు చెల్లించుకున్న విషయం తెలిసిందే. కురవి వీరభద్రస్వామి, కొమురెల్లి మల్లన్న, యాదాద్రి నరసింహస్వామి, వరంగల్ భద్రకాళికి ఇప్పటికే మొక్కులు చెల్లించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









