ప్రత్యేక హోదాపై గళం విప్పిన సినీ ప్రముఖులు...
- January 24, 2017
సంప్రదాయ ఆట జల్లి కట్టు పై నిషేధంపై సుప్రీ కోర్టు ఇచ్చిన తీర్పునే తిరగరాయించుకొన్న తమిళుల పోరాటం నుంచి స్ఫూర్తిని పొందిన సీమాంద్ర యువత ప్రత్యేక హోదా కోసం గళం విప్పుతోంది. పవన్ ఆరు నెలల క్రితమే ప్రత్యేకహోదా పై గళం విప్పగా.. అప్పుడు శివాజీ, సంపూర్ణేష్ బాబు తప్ప ఏ ఒక్కరి నుంచి మద్దతు రాలేదు.. కానీ ప్రస్తుత పరిస్థితులు మారాయి.. అందరూ మాట్లాడాల్సిన సమయం వచ్చింది..
ఇప్పటికే సందీప్ కిషన్, నిఖిల్ వంటి హీరోలు యువత చెప్పటిన మౌన దీక్షకు మద్దతు తెలిపిన సంగతి విధితమే.. తాజాగా వీరిబాటలో మరికొందరు సినీ ప్రముఖులు యువత చెప్పటిన మౌన దీక్షకు తమ మద్దతు తెలిపారు..
మంచు మనోజ్ ఆంధ్ర ప్రదేశ్ స్పెషల్ స్టేటస్ సైలెంట్ ప్రొటెస్ట్ కి తన మద్దతు తెలుపుతూ తన గుంటూరోడు మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ని పోస్టుపోన్ చేసుకున్నాడు.
ప్రముఖ రచయిత కోన వెంకట్ ప్రత్యేక హోదా ఇవ్వండి అని మేం కొత్తగా ఏమీ కోరడం లేదు. మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి అని మాత్రమే అడుగుతున్నాం. మీరు ప్రత్యేక హోదా అనే హామీని తీసి పక్కనపెడితే...ప్రజలు ప్రభుత్వాన్ని దించి పక్కన పెడతారేమో. కొంచెం చూసుకోండి. అని తనదైన శైలిలో గళం విప్పారు.
లోక్ సత్తా పార్టీ అధినేత జేపీ ఏపీ యువత ఒక్కతాటిపైకి వచ్చి ప్రత్యేక హోదా కోసం గళం విప్పాలి అని కోరుకున్నారు..
పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ తన ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ పోరాటంపై నాకు నమ్మకం ఉంది. ప్రజల ఆకాంక్షలు ఫలించే కోణంలో ఆయన ఇచ్చిన పిలుపునకు నా పూర్తి మద్దతుఅని ట్వీట్ చేశారు..
వరుణ్ తేజ్ః రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడే ఏ అంశానికైనా నా మద్దతు ఉంటుంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం మద్దతివ్వండి.
మన రాష్ట్రానికి హామీ ఇచ్చిన దాన్ని సాధించుకునేందుకు మనమంతా ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఇది ఏపీకి ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా గళం విప్పుదాం అని సాయి ధరం తేజ్ స్పందించారు.
తెలుగు యువతకు ఏదైనా సాధించే శక్తి ఉంది. టాలీవుడ్ సెలబ్రిటీలు ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ నెరవేర్చుకునేందుకు ముందుకు రావాలి. మనమంతా ఐక్యం అవుదాం. ఏపీ హక్కును సాధించుకుందాం అని ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు..
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









