అనురాధ పౌడ్వాల్‌ పద్మశీ పురస్కారం

- January 25, 2017 , by Maagulf
అనురాధ పౌడ్వాల్‌ పద్మశీ పురస్కారం

న లభై ఏళ్లకు పైగా తన గాత్రంతో అలరిస్తున్న అనురాధ పౌడ్వాల్‌కు విశిష్ట గౌరవం దక్కింది. ఆమెను పద్మశీ పురస్కారం వరించింది. 16 భాషల్లో వేల గీతాలతో పాటకు పట్టం కట్టిన అనురాధ గాన ప్రస్థానమిదీ.

కర్నాటకకు చెందిన అనురాధ అసలు పేరు అల్కా నందకర్ణి.

21 ఏళ్ల వయసులో అమితాబ్‌ బచ్చన్‌ చిత్రం 'అభిమాన్‌'(1973)తో అనురాధ తొలిసారి తన గొంతు వినిపించింది. అదే ఏడాది మరాఠీ చిత్రసీమకూ పరిచయమైంది. 1976లో శత్రుఘ్న సిన్హా నటించిన 'కాళి చరణ్‌'తో అనురాధ చిత్రసీమ దృష్టిలో పడింది. అందులోని 'ఏక్‌ బటా దో.. దో బటే చార్‌..' గీతం ఆమెకు గుర్తింపు తీసుకొచ్చింది. ఎస్‌.డి.బర్మన్‌, ఆర్‌.డి.బర్మన్‌, లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌, జైదేవ్‌, కల్యాణ్‌ జీ ఆనంద్‌ జీ, బప్పీ లహరి, రాజేష్‌ రోషన్‌, ఆనంద్‌ మిలింద్‌, నదీమ్‌ శ్రావణ్‌, జతిన్‌ లలిత్‌, ఎ.ఆర్‌.రెహమాన్‌ లాంటి ప్రముఖ సంగీత దర్శకుల సారథ్యంలో అనురాధ ఎన్నో గీతాలతో ఆకట్టుకుంది. ఒక్క హిందీలోనే 5296 పాటలకు పైగా పాడింది. కన్నడ, మరాఠీ, బెంగాలీ, సంస్కృతం, గుజరాతీ, తమిళం, తెలుగు తదితర 16 భాషల్లో వందల పాటలు పాడింది. మరో వైపు ప్రైవేట్‌ ఆల్బమ్స్‌, భజన గీతాలు ఆలపించింది. ఆమె కుమార్తె కవితా పౌడ్వాల్‌ కూడా గాయకురాలిగా కొనసాగుతోంది.
హ్యాట్రిక్‌ ఫిలింఫేర్‌: అనురాధ ఆషికి (1990), దిల్‌ హై కీ మాంతా నహీ (1991), బేటా (1992) చిత్రాలతో వరుసగా మూడు సంవత్సరాలు ఫిలింఫేర్‌ పురస్కారాలు గెలుచుకుంది. మొత్తం 1989లో 'కలత్‌ నకలత్‌'లోని 'ఏక్‌ రెషామీ..' గీతానికి జాతీయ పురస్కారం గెలుచుకుంది. లతా మంగేష్కర్‌ తర్వాత డి.లిట్‌ గౌరవ డిగ్రీని అందుకున్న రెండో గాయకురాలిగా నిలిచింది. 'అభినవ లతా మంగేష్కర్‌'గా సంగీత దర్శకులతో పిలిపించుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com