APNRT ఇంటరాక్టివ్ సమావేశం.. విద్యార్ధులకు సూచనలు...
- January 31, 2017
కృష్ణా జిల్లా ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల సంఘం అధ్యక్షుడు ముత్తవరపు శ్రీనివాస్ బాబు, ఏపీఎన్నార్టీ చీఫ్ కో ఆర్డినేటర్ కలపరపు బుచ్చి రాంప్రసాద్ ఆధ్వర్యంలో ఏపీఎన్నార్టీ ఇంటరాక్టివ్ సమావేశం విజయవాడలోని స్వర్ణ ప్యాలస్‌లో జరిగింది . ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా ఏపీఎన్నార్టీ చైర్మన్ అండ్ సీఈఓ వేమూరి రవి హాజరయ్యారు. ఈ సమావేశ౦ లో ఇంజనీరింగ్ విద్యార్ధుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై జిల్లాలోని 38 కళాశాలల ప్రతినిధులతో ఆయన చర్చించారు. ఆంధ్ర ప్రదేశ్‌లో త్వరలో ఒరాకిల్ ,మైక్రోసాఫ్ట్ వంటి సాఫ్ట్వేర్ సంస్థలు డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నాయని, అందుకు తగిన విధంగా విద్యార్ధుల్లో వృత్తి నైపుణ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు.అలాగే ఏపీఎన్నార్టీ చైర్మన్ అండ్ సీఈఓ వేమూరి రవికుమార్ గారు కొత్తగా వచ్చే ఇంజనీరింగ్ విద్యార్థులకి కొన్ని సూచనలు ఇచ్చారు.
ఇంజనీరింగ్ చదవాలన్న ఆకాంక్ష చాలా మందికి ఉంటుంది. అయితే, ఎక్కువ మందికి కాలేజీ మొదలుకుని బ్రాంచ్ ఎంపిక వరకు అన్నీ సందేహాలే ఉంటాయి. ఈ విషయంలో తలెత్తే అనేక సందేహాలను సంబంధిత ఎప్పటికప్పుడు పుణుల దృష్టికి తీసుకెళ్ల్ళి సమాధానాలు రాబట్టాలి.
ఇంజనీరింగ్ చేసే వ్యక్తికి ప్రధానంగా అయిదు ఎనర్జీలు ఉండాలి.
ఎనర్జీ, ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్, ఎంటర్టైన్మెంట్,
ఎంట్రప్రెన్యూర్షిప్ ఉండాలి. ఈ అయిదింటిపై దృష్టి సారించిన ఇంజనీర్‌కు మంచి భవిష్యత్తు ఉంటుంది.
ప్రస్తుతం రెండు రాషా్ట్రల్లో వందల సంఖ్యలో కాలేజీలు ఉన్నాయి. కౌన్సెలింగ్ ప్రారంభమయ్యే వరకు వీటిపై కచ్చితమైన సమాచారం తెలిసే అవకాశం లేదు. ఉదాహరణకు తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల తనిఖీ జరుగుతోంది. ఇది పూర్తయిన తరవాతే పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా ఫలానా కాలేజీ మంచిదని చెప్పడం కూడా కష్టం. 1995 వరకు రాష్ట్రంలో 35 ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రమే ఉండేవి. గత సంవత్సరం వీటి సంఖ్య 700 దాటింది. (వీటిలో ఇప్పటికే కొన్నింటి గుర్తింపు రద్దు కాగా, మరికొన్నింటి గుర్తింపు సైతం రద్దయ్యే అవకాశం ఉంది). ఈ నేపథ్యంలో నాక్, ఎన్‌బిఏ, ఏఐసిటిఇ గుర్తింపు పొందిన కాలేజీలను ఎంచుకోవడం మంచిది.
వివిధ మ్యాగజైన్లు, ఆర్గనైజేషన్లు నిర్వహించే సర్వేలు చూడండి. పూర్వ విద్యార్థులతో మాట్లాడితే కాలేజీ వివరాలు తెలుస్తాయి. ఆయా కాలేజీల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్, మౌలిక సౌకర్యాలు మొదలైనవాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోండి. దేశంలో సాంకేతిక రంగంతో పాటు దాదాపు అన్ని రంగాల్లో నానాటికీ పెనుమార్పులు వస్తున్నాయి. దాదాపు అన్ని బ్రాంచీలకు కొంచెం అటుఇటుగా అవకాశాలు బాగానే ఉన్నాయి. విద్యార్థి ఆసక్తిని బట్టి మొదట కోర్సు ఎంపిక చేసుకోవాలి. తల్లిదం డ్రులు కూడా పిల్లల ఆసక్తిని గమనించాలి. భవిష్యత్తులో ప్రత్యేకించి ఆ కెరీర్లో ఇమిడిపోవాల్సింది తనే అన్న విషయం గుర్తించాలి. ఆ తరవాత మాత్రమే కనీసం నాలుగేళ్లుగా పనిచేస్తున్న కాలేజీని ఎంపిక చేసుకోవాలి. ఏ కాలేజీకైనా మౌలిక సదుపాయాలు కల్పించుకునేందుకు ఈ సమయం సరిపోతుంది. అలాగే ఫ్యాకల్టీ, సీనియర్ విద్యార్థులతో మాట్లాడితే కాలేజీపై కొంత అవగాహన కలుగుతుంది. ప్లేస్‌మెంట్స్ సహా వివిధ విషయాలపై వారు మరింత సమాచారం ఇవ్వగలుగుతారు. అన్నింటిపై అవగాహనకు వచ్చాక బ్రాంచ్, కాలేజీపై ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది.
ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ నిరంజన్ మోటూరి ఏపీఎన్నార్టీ స్పెషల్ ఆఫీసర్ , పూల ప్రసాద్ ఏపీఎన్నార్టీ డైరెక్టర్ (ఆపరేషన్స్ ), శ్రీ డి.వి. రావు, ఓఎస్డి ఏపీఎన్నార్టీ సాగర్ తదితరులు హాజరయ్యారు
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









