అడవి శేష్‌, అవసరాల మల్టీ స్టారర్‌ షురూ

- February 01, 2017 , by Maagulf
అడవి శేష్‌, అవసరాల మల్టీ స్టారర్‌ షురూ

'జెంటిల్‌మెన్‌' హిట్‌ తర్వాత దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి శ్రీనివాస్‌ అవసరాల, అడివి శేష్‌ హీరోలుగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎ గ్రీన్‌ ట్రీ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ క్లాప్‌ కొట్టగా.. వినయ్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. తనికెళ్ళ భరణి గౌరవ దర్శకత్వం వహించారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.సి. నరసింహారావు మాట్లాడుతూ.. 'నేడు పూజా కార్యక్రమాలతోపాటు రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా మొదలుపెట్టనున్నాం. అడివి శేష్‌, అవసరాల శ్రీనివాస్‌లు కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఈష, అదితి మ్యానికల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీత సారథ్యం వహించనున్న ఈ చిత్రానికి పి.జి. విందా కెమెరా బాధ్యతలు నిర్వహించనున్నారు' అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com