మరింత సులభంకానున్న పాస్‌పోర్టు సేవలు

- February 01, 2017 , by Maagulf
మరింత సులభంకానున్న పాస్‌పోర్టు సేవలు

పాస్‌పోర్టు సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. పాస్‌పోర్టు పొందాలంటే ఇప్పటి వరకు ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి. కానీ ఇకపై ప్రధాన తపాలా కార్యాలయాల్లో కూడా పాస్‌పోర్టు సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు జైట్లీ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.

* జవాన్లు, సైనికాధికారులు ఆన్‌లైన్‌ ద్వారా రైలు టికెట్లు కొనుక్కునేందుకు వీలుగా ''కేంద్రీకృత రక్షణ ప్రయాణ వ్యవస్థ'ను అభివృద్ధి చెసినట్లు విత్తమంత్రి తెలిపారు. టికెట్ల కోసం సైనికాధికారులు రైల్వే వారెంట్‌ పట్టుకుని క్యూలో నిల్చుని ఇబ్బండి పడాల్సిన అవసరం ఇంక ఉండదన్నారు.

* రక్షణరంగ పింఛనర్ల కోసం ఇంటర్నెట్‌ ఆధారిత సమగ్ర పింఛను పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ వ్యవస్థ పింఛను ప్రతిపాదనలు అందుకుని చెల్లింపులు జరుపుతుందన్నారు. ఫలితంగా .. రక్షణ రంగ పింఛనుదార్ల ఇబ్బందులు తీరుతాయని జైట్లీ వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com