విపరీత పోకడలకు పోతే దేశ బహిష్కరణ తప్పదు, కువైట్ వీధులలో క్రీడా వేడుకల్లో నిర్వాసితులు...

- February 01, 2017 , by Maagulf
విపరీత పోకడలకు పోతే  దేశ బహిష్కరణ తప్పదు,  కువైట్ వీధులలో క్రీడా వేడుకల్లో నిర్వాసితులు...

కువైట్ : కువైట్ వీధుల్లో క్రీడా విజయాల వేడుకలలో నిర్వాసితులు విపరీత పోకడలకు పోయి ట్రాఫిక్  ఆటంకపర్చడం  'అనైతిక ప్రవర్తన' పాల్పడితే దేశ బహిష్కరణకు ఎదుర్కొక తప్పదని , కువైట్ ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ మీడియా మరియు రిలేషన్స్ జనరల్ డైరెక్టరేట్ హెచ్చరించింది. నేరస్థులకు వ్యతిరేకంగా అవసరమైన చట్టబద్ధమైన విధానాలు చేపట్టి అవసరమైతే దేశ బహిష్కరణకు సైతం వెనకాడబోమని ప్రతిజ్ఞ చేశారు. కువైట్ ట్రాఫిక్ చట్టం అనుగుణంగా వ్యవహరించాలని వాహన ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ తెలిపారు.  ప్రైవేట్ ఊరేగింపులు లేదా సమావేశాలతో పాల్గోని మరొకరికి ట్రాఫిక్ అవరోధాలు కల్గించకూడదని ముఖ్యంగా రాత్రి సమయాలలో ఇతరులకు ఏమాత్రం భంగం కల్గించకూడదని అటువంటివారికి అనుమతి లేదని  ఆయన ఒక ప్రకటనలో తెలిపారు, కువైట్ ట్రాఫిక్ నియమాల ప్రకారంగా సహకరించాలని కువైట్ లో అడుగిడిన కొత్త వ్యక్తులకు మీడియా డైరక్టరేట్ అధికారులు విజ్ఞప్తి చేశారు. నిర్వాసితుల జీవితాలను మరియు ఆస్తి రక్షణను కాపాడాల్సిన  నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకొంటున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com