అమరావతి వైభవం - నవ్యాంధ్ర ఆశాకిరణం

- September 16, 2015 , by Maagulf

2015,జూన్ 6 వ తేది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించ దగినరోజు ,ఆంధ్రుల కల నవ్యాంధ్ర రాజధాని భూమి పూజ జరిగిన రోజు ,తెలుగు నేల ,తెలుగు తల్లి పులకించిన రోజు,కృష్ణమ్మ ఆనందంతో ఉప్పొంగిన రోజు  ఎందుకంటే 

-అమరావతి 2,200 సంవత్సరాల గత వైభవ విశిష్టత కలిగినది . 

- కృష్ణమ్మ ఒడిలో అలరారిన ప్రదేశం . 

- అమరావతి క్రీ . పూ 2 వ శతాబ్దంలో అశోకుని బౌద్ద స్థూపాలతో ,నాగార్జునకొండ విశిష్టత లతో , బౌద్దమతము  ఫరిడవిల్లిన ప్రదేశం 

- అమరావతి శిల్పకళ భారతదేశంలోని 3 శిల్పకళలలో ఒకటిగా ప్రసిద్ది చెందినది . మిగిలినవి {గాంధార & మధుర }

-  ఇక్కడి అనేక శిల్ప కళా ఖండాలు  ఇప్పటికి మద్రాస్ మ్యూజియం లోను ,లండన్ లోని బ్రిటిష్ మ్యూజియం లోను అమరావతి కళా సంపదగా ప్రత్యేకంగా ప్రదర్శింప బడుతుంది . 

- పవిత్రమైన అమరేశ్వర ఆలయం పంచారామాలలో ఒకటిగా భాసిల్లుతున్నది . 

- పురాణాల ప్రకారం దేవేంద్రుడి రాజధానిగా అమరావతిని చెపుతారు . 

- ఇక్కడి పార్శ్వనాద తీర్ధ ,జైనులకు పరమ పవిత్ర క్షేత్రం . 
- క్రీ . పూ 2 వ శతాబ్దంలోధరణికోటను రాజధానిగా చేసుకొని 450 సంవత్సరములు శాతవాహనులు 

మహా రాజ్యాన్ని పరిపాలించిన ప్రదేశం . 

-  ఇక్కడి నుండే మన సంస్కృతి ,సాంప్రదాయాలు ఆగ్నేయ ఆసియా దేశాలకూ  విస్తరించాయి {మలేసియా ,ఇండోనేసియా ,ఫిలిప్పేన్స్ ,థాయిలాండ్ మరియు సింగపూర్ }

- తెలుగు భాష ,సంస్కృతి ,సంప్రదాయాల పురిటి గడ్డ ఈ ప్రాంతం . 

- పచ్చని వరిపొలాలతో ఆంధ్రుల అన్నపూర్ణగా నిలిచిన ప్రదేశం . 

- వాడరేవు మరియు మచిలీపట్నం ఓడరేవులకు సుమారు 100 కి.మి దూరంలో సముద్ర వాణిజ్యానికి అనుకూల ప్రదేశం అమరావతి . 

- అమరావతి ఆంధ్రప్రదేశ్ కు  మధ్యలో అందరికి అనుకూలముగా ఉన్నది. 

- ఇటువైపు 1953లో ఒకప్పటి రాజధాని కర్నూలు ఉన్నప్పటికీ ,అటువైపు అతిపెద్ద నగరం విశాఖపట్నం ఉన్నప్పటికీ ,ప్రజలు విశాల దృక్పధంతో అంగీకరించిన రాజధాని ప్రాంతం అమరవతి. 

- వినూత్న పధకంలో భాగంగా భూ సమీకరణ ద్వారా తమ భూములను ,రాజధానికై ధారపోసిన రైతన్నలకు ,అన్నదాతలకు  జేజేలు పలుకుతూ పాదాభివందనాలు అర్పిద్దాం . 

-  హేతుబద్ధం కాని విభజనలో నష్టపోయినప్పటికీ , ఆంధ్రప్రజల దృఢ సంకల్ప  నిదర్శనమే సంవత్సరం లోపు  నవ్యాంధ్ర రాజధానికి నాంది ,పునాది . 

-  కారణాలు ఏమైనప్పటికీ ,రాష్ట్రం ఏర్పడిన 60 సంవత్సరాల తరువాత కుడా నిలువనీడ లేక రాజధానిని వెతుక్కుంటున్న ఆంధ్రులలో దైర్యాన్ని నింపుతున్న అమరావతి . 

-  ఆంధ్రప్రదేశ్ ,అమరావతులు అక్షరాలలోనే కాక అభివృద్ధిలోనూ గణనీయమైన ప్రగతిని సాధించి మన తెలుగు ప్రజల ఆశలు ,ఆకాంక్షలు నెరవేర్చి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిలబడుతుందని ఆకాంక్షిద్దాం. 

 

--ఆర్.వి. రావు  & వకుళ దేవి 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com