ప్రొడ్యూస్ చేస్తూ బిజీగా వున్నా కళ్యాణ్ రామ్...

- February 06, 2017 , by Maagulf
ప్రొడ్యూస్ చేస్తూ బిజీగా వున్నా కళ్యాణ్ రామ్...

తారక్‌తో ఫస్ట్ టైం మూవీ ప్రొడ్యూస్ చేస్తూ బిజీగా వున్నాడు కళ్యాణ్ రామ్. ఈ మూవీ కోసం ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు.. టాప్ టెక్నీషియన్లని సెలెక్ట్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ తొలిసారి ట్రిపుల్ రోల్ చేస్తున్న ఈ మూవీలో రాశి ఖన్నా ఓ హీరోయిన్‌గా చేస్తోంది. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 10న స్టార్ట్ కానుంది.
ఇక 'ఇజం' తరువాత తను చేయబోయే మూవీ గురించి కూడా కథలు విన్న కళ్యాణ్ రామ్ ఓ స్టోరీ ఫైనల్ చేశాడట. ఇంతకుముందు 'ప్రేమ.. ఇష్క్.. కాదల్', నారా రోహిత్‌తో 'సావిత్రి' లాంటి సినిమాలు చేసిన యంగ్ డైరెక్టర్ పవన్ సాధినేని చెప్పిన స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కళ్యాణ్ ఇంతవరకు ట్రై చేయని కొత్త జానర్‌లో ఈ మూవీ వుండబోతోందట.
తారక్ మూవీ రెగ్యులర్ షూట్ స్టార్ట్ అయిన తరువాత పవన్‌తో మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడట కళ్యాణ్ రామ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com