జెడ్డా స్పింగ్‌ ఫెస్టివల్‌ సరికొత్త రికార్డ్‌

- February 06, 2017 , by Maagulf
జెడ్డా స్పింగ్‌ ఫెస్టివల్‌ సరికొత్త రికార్డ్‌

జెడ్డా: జెడ్డా స్ప్రింగ్‌ ఫెస్టివల్‌ 800,000 మందికి పైగా విజిటర్స్‌ని ఎట్రాక్ట్‌ చేసి సరికొత్త రికార్డుల్ని సృష్టించింది. జనవరి 26న ఈ ఫెస్టివల్‌ ప్రారంభమయ్యింది. ఫెస్టివల్‌ నిర్వాహకులు 2 మిలియన్‌ విజిటర్స్‌ని ఎట్రాక్ట్‌ చేయగలమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులపాటు ఈ లాంగ్‌ ఫెస్టివల్‌ జరగనుంది. అసోసియేషన్‌ ఆఫ్‌ నైబర్‌హుడ్‌ సెంటర్స్‌ ఇన్‌ జెడ్డా ఏర్పాటు చేసిన ఈ ఫెస్టివల్‌ రెడ్‌ సీ మాల్‌ దగ్గరలో సందర్శకులను ఆకట్టుకుంటోంది. పబ్లిక్‌ రిలేషన్స్‌ డైరెక్టర్‌ రబీ బిన్‌ జఫార్‌ మాట్లాడుతూ, జెడ్డా స్ప్రింగ్‌ ఫెస్టివల్‌ 50,000 చదరపు మీటర్ల స్థలంలో, 400కి పైగా ఎగ్జిబిటర్స్‌తో ఏర్పాటయ్యిందన్నారు. ఫోక్‌ విలేజ్‌ జూ, అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌, సంప్రదాయ టచ్‌ కోసం విజిటర్స్‌కి టెంట్స్‌ కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. విజిటర్స్‌, స్ప్రింగ్‌ ఫెస్టివల్‌ అద్భుతంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com