మరో ఘనతను సొంతం చేసుకోనున్న ఇస్రో

- February 07, 2017 , by Maagulf
మరో ఘనతను  సొంతం చేసుకోనున్న ఇస్రో

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గగనంలో మరో ఘనతను  సొంతం చేసుకోబోతోంది. గత దశాబ్ద కాలంలో అనేక ప్రతిష్ఠాత్మక ప్రయోగాలతో  దేశ ఖ్యాతిని ఆకాశమంత ఎత్తుకు చేర్చిన షార్‌ ఇప్పుడు ఏకంగా ప్రపంచానికే సవాల్‌ విసరబోతోంది. మంగళ్‌యాన్‌, చంద్రయాన్‌-1 వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు విజయవంతం చేసిన ఆత్మవిశ్వాసంతో ఈ ఏడు సరికొత్త  అధ్యాయాన్ని లిఖించేందుకు సిద్ధమైంది. ఒకేసారి ఒకే రాకెట్‌ ద్వారా 108 ఉపగ్రహాలను ప్రయోగించే అరుదైన సవాల్  అందుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఆ సువర్ణ అధ్యాయానికి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం నెల్లూరు జిల్లాలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌) వేదిక  కాబోతోంది. ఫిబ్రవరి 15న  ఉద‌యం 9.28గంట‌ల‌కు పీఎస్‌ఎల్‌వీ-సి37 రాకెట్‌ ద్వారా మన దేశానికి  చెందిన కార్టోశాట్‌-2డి ఉపగ్రహం సహా 108 ఉపగ్రహాలు  ప్రయోగించనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com