ఇంటర్‌సెప్టర్ మిస్సైల్ పరీక్ష విజయవంతం...
- February 11, 2017
ఇంటర్‌సెప్టర్ మిస్సైల్ పరీక్ష విజయవంతం
గీత దాటే శత్రు క్షిపణులు ఇక తునాతునకలే..
4 అగ్ర దేశాల సరసన భారత.. మోదీ అభినందన
బాలాసోర్, ఫిబ్రవరి 11: బాలాసోర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్)కు చెందిన అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఇంటర్‌సెప్టర్ మిస్సైల్‌ను శనివారం ఉదయం 7 గంటల 45 నిమిషాలకు విజయవంతంగా పరీక్షించింది. ఈ తరహా మిస్సైల్ కల్గిఉన్న ఐదో దేశంగా అవతరించింది. ఈ క్షిపణి ద్వారా గగనతల భద్రతను మరింత పటిష్టం చేయవచ్చని డీఆర్డీవో తెలిపింది. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డీఆర్డీవో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి పర్రికర్ శుభాకాంక్షలు తెలిపారు.
దీనికి పీడీవీ మిషన్ అని నామకరణం చేశామని డీఆర్డీవో అధికారి ఒకరు తెలిపారు. భూ వాతావరణం నుంచి 50 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఉన్న లక్ష్యాలనూ ఛేదించగలగడం ఈ మిస్సైల్ ప్రత్యేకత అన్నారు. 2000 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయోగించిన క్షిపణులను ఇది ఛేదించగలదు. కాగా, క్షిపణి పరీక్ష విజయవంతంపై డీఆర్డీవో శాస్త్రవేత్తలను మోదీ అభినందించారు.
ఉత్తరప్రదేశ్‌లోని బదావున్లో ఎన్నికల ర్యాలీ సందర్భంగా మోదీ ప్రసంగించారు. ప్రతిపక్షాలు సర్జికల్ దాడులకు ఆధారాలు చూపమన్నట్లుగా, ఈ క్షిపణి పరీక్ష విజయవంతమైందనడానికి రుజువులు అడుగుతాయేమోనని ఎద్దేవా చేశారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









