బంగారం తరలిస్తూ పట్టుబడ్డ నిందితుడు...

- February 12, 2017 , by Maagulf
బంగారం తరలిస్తూ పట్టుబడ్డ నిందితుడు...

హైదరాబాద్ : బంగారం అక్రమ రవాణాకు చివరకు ఎల్‌ఈడీ బల్బులను కూడా వాడుతున్నారు. ఆదివారం ఓ ప్రయాణికుడు ఎల్‌ఈడీ బల్బుల్లో బంగారం తరలిస్తూ పట్టుబడ్డాడు. దీంతో కస్టమ్స్‌ అధికారులు ఆవాక్కయ్యారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా సింగపూర్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి భారీగా బంగారం పట్టుకున్నారు. అయితే... ఎల్‌ఈడీ బల్బుల్లో బంగారాన్ని తీసుకురావడం ఇక్కడ కొసమెరుపు. ఇప్పటివరకు ఆయా పద్దతుల్లో బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడ్డ దుండగులు చివరకు ఎల్‌ఈడీ బల్బులను కూడా ఉపయోగించడంతో కస్టమ్స్ అధికారులు ఆశ్చర్యపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com