చివరి షెడ్యూల్ షూటింగ్ లో నాగ అన్వేష్“ఏంజెల్”...
- February 14, 2017
మన్యంపులి వంటి సూపర్ హిట్ తరువాత ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణా రెడ్డి పర్యవేక్షణలో శ్రీ సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్ పై యంగ్ హీరో నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బాపటేల్ జంటగా తెరకెక్కుతోన్న సినిమా ఏంజిల్. సోషియోఫాంటసీ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో నిర్మాతగా భువన్ సాగర్, దర్శకుడిగా బాహుబలి పళని తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ ఈ చిత్ర బృందం పూర్తి చేసుకొంది. తదుపరి షూటింగ్ ఫిబ్రవరి 14 నుంచి మొదలుకాబోతుంది. ఇక ఈ సినిమాలో సప్తగిరి, ప్రదీప్ రావత్, షియాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సెస్సరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. కళ్లు చెదిరే గ్రాఫిక్స్ హంగులతో ఈ చిత్రాన్ని ఓ విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు బాహుబలి పళని సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసమే సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ముగించి విజువల్ ఎఫెక్ట్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలుపెట్టేందుకు ఏంజిల్ టీమ్ ప్లాన్ చేస్తోంది.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









