ఫిబ్రవరి 21న శ్రీ విష్ణు `మా అబ్బాయి` ఆడియో విడుదల
- February 18, 2017
ప్రేమ ఇష్క్ కాదల్, ప్రతినిధి, అప్పట్లో ఒకడుండేవాడు వంటి చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బేబీ సాక్షి సమర్పణలో కుమార్ వట్టి దర్శకత్వంలో బలగ ప్రకాష్ రావు నిర్మిస్తోన్న చిత్రం `మా అబ్బాయి`. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా....
చిత్ర నిర్మాత బలగ ప్రకాష్ రావు మాట్లాడుతూ -``మా వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న తొలి చిత్రం `మా అబ్బాయి`. లవ్, సెంటిమెంట్, కామెడి, యాక్షన్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం. శ్రీవిష్ణు నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమా చాలా బాగా వచ్చింది. దర్శకుడు కుమార్ వట్టి సినిమాను చాలా చక్కగా డైరెక్ట్ చేశారు.
ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. అందులో భాగంగా డి.టి.ఎస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి ఆరు అణిముత్యాల్లాంటి ట్యూన్స్ అందించారు. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమాన్ని పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్‌లో ఫిబ్రవరి 21న గ్రాండ్‌గా నిర్వహిస్తున్నాం. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మార్చి మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః థమశ్యామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః వండాన రామకృష్ణ, సంగీతంః సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్ః మార్తాండ్.కె.వెంకటేష్, ఫైట్స్ రాబిన్ సుబ్బు నబ, కొరియోగ్రాఫర్స్ః రఘు, అజయ్, సాయి, స్వర్ణ, పాటలుః కందికొండ, కరుణాకర్ అడిగర్ల, సురేష్ బనిశెట్టి, నిర్మాతః బలగ ప్రకాష్ రావు,కథ,స్ర్కీన్ ప్లే,మాటలు,దర్శకత్వంః కుమార్ వట్టి.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం
- సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన..షెడ్యూల్ ఇదే!
- స్క్రబ్ టైఫస్‌తో మూడుకు చేరిన మొత్తం మరణాల సంఖ్య
- ఇండిగో సంస్థ పై కేంద్రం చర్యలకు సిద్ధం
- వచ్చే యేడాది అందుబాటులోకి రానున్న విమాన కార్గో సేవలు
- మైనర్ బాలిక పై లైంగిక దాడి..భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!







