వరుసగా 8వ సారి నేషనల్ టూరిజం అవార్డు గెలుచుకున్న సదరన్ ట్రావెల్స్

- September 19, 2015 , by Maagulf

ISO 9000 కంపెనీ ఐన సదరన్ ట్రావెల్స్ వారు వరుసగా ఎనిమిదవ సారి కూడా భారత ప్రభుత్వ పర్యాటక శాఖ వారి  'బెస్ట్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్' అవార్డును గెలుచుకున్నారు. శుక్రవారం న్యూ ఢిల్లీ, విజ్ఞాన్ భవన్లో జరిగిన జరిగిన ఒక కార్యక్రమంలో, భారాత్ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా, సంస్థ మ్యానేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆలపాటి కృష్ణ మోహన్ మరియు జాయింట్ మ్యానేజింగ్ డైరెక్టర్ ఆలపాటి ప్రవీణ్ కుమార్ స్వీకరించారు. తమ వ్యాపారాలను పాశ్చాత్య, యూరోప్ మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కూడా విస్తరించే ఆలోచన ఉందని వారు ఈ సందర్భంగా తెలిపారు. న్యూ ఢిల్లీ, విజయవాడ మరియు  జైపూర్ లలో 200 హోటల్ రూములను కలిగిఉన్న తమ  సంస్థలో- భద్రత, సురక్షత మరియు సదుపాయాలకే పెద్దపీట వేస్తామని తెలియజేశారు.

 

మాగల్ఫ్.కాం తరుపున సదరన్ ట్రావెల్స్ సంస్థకు ప్రత్యేక అభినంధనులు.

 

--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com