జార్జియాలో బ్రాహ్మణ అసోసియేషన్ ప్రారంభం
- February 21, 2017
అమెరికాలోని అట్లాంటాలో ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ జార్జియా తెలుగు బ్రాహ్మణ అసోసియేషన్‌ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్మన్ ఐ.వై.ఆర్ కృష్ణారావు స్కైప్ ద్వారా దీనిని ప్రారంభించారు. అనంతరం అట్లాంటాలోని 150 తెలుగు బ్రాహ్మణ కుటుంబాలని ఉద్దేశించి మాట్లాడారు. వెల్ఫేర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను గురించి వివరించారు. అనంతరం పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అందరూ ఐక్యతగా ఉండాలని, ఎంటర్ప్రన్యూర్లుగా ఎదగాలని, సామాజిక బాధ్యతతో బీద బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు. అట్లాంటాలోని మిడ్వే పార్కులో మొట్టమొదటి ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ సభను నిర్వహించారు. వేదమంత్రాల నడుమ సూర్య, గణపతి ఆరాధనతో జ్యోతి ప్రజ్వలన చేసి వేదోక్తంగా విజయా లంక కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం ఫణికుమార్ ఆశీర్వచనాలు అందించారు. ప్రొఫెసర్ రాజు పోలాప్రగడ, డాక్టర్ కృష్ణ మోహన్ అధ్యక్షత వహించి సభని విజయవంతంగా నడిపించారు. శ్రీనివాస్ భాగవతం బ్రాహ్మణ సమాజం ఆవశ్యకతను వివరించారు. సంధ్య యల్లాప్రగడ వేదం, ధర్మ పరిరక్షణకు ఈ ప్రజ్ఞానం బ్రాహ్మ తోడ్పడుతుందని అన్నారు. వెంకట్ పింగళి తెలుగు బ్రాహ్మణ సమాజం, కార్యాచరణ గురించి వివరించారు. బ్రాహ్మణ ధర్మ పరిరక్షణ, వేద పాఠశాల తోడ్పాటు, ఆలయ జీర్ణోద్ధారణ.. సంరక్షణల వంటి పథకాలలో పాటు బ్రాహ్మణ వివాహ వేదికగా, ఐటీ నెట్వర్కింగ్, యోగ, సంధ్యావందనం వంటివి బోధించేందుకు జార్జియా తెలుగు బ్రాహ్మణ అసోసియేషన్ తోడ్పడుతుందని వివరించారు. అనుసంధాన కర్తగా సాయిరాం కారుమంచి వ్యవహరించారు.
ఈ సందర్భంగా అట్లాంటాలో ప్రముఖ పాత్రికేయుడు, ఇండియా ట్రిబ్యూన్ సంపాదకులు రవి పోణంగి సభని ఉద్దేశించి మాట్లాడారు. కృష్ణారావు ఉపన్యాసం సభికులను ఎంతో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు కేవి రమణాచారి పంపించిన సందేశాన్ని, మాజీ ఉన్నత విద్యాశాఖ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పంపిన సందేశాన్ని ఆయన చదివి వినిపించారు.
కార్యక్రమానికి శ్రీనివాస్ దుర్గం అనుసంధాన కర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఇటువంటి కార్యక్రమాలు అట్లాంటా నుంచి మొదలవ్వటం శుభపరిణామం అని చెప్పారు. కార్యక్రమంలో సురేశ్ గాదిరాజు, కొండల్ నల్లజర్ల, కమల్ సాతులూరు, రవికిరణ్, రంగాచారి, సంధ్యా యల్లాప్రగడ, రమ గాదిరాజు, శ్రీదేవి దాడితోట, గౌరీ సాయిరాం, లతా పింగళి, శైలజ భాగవతం, ఉమాపోణంగి, శ్రీకాంత కర్రి, రఘుతుంగిరాల, వరప్రసాద్ కుందేరు, శ్రీరామ్ కొత్తూరి, సునీల్ తట్ట తదితరులు పాల్గొన్నారు.
--కళ్యాణి చిత్రపు

తాజా వార్తలు
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!









