గాల్లో తేలిన విమానం నిద్రపోయిన పైలెట్...

- February 22, 2017 , by Maagulf
గాల్లో తేలిన విమానం నిద్రపోయిన పైలెట్...

న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్‌కి చెందిన ఓ విమానం ఇటీవల జర్మనీ గగనతలంలో దారితప్పడంపై విస్తుబోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు నివేదిక తయారు చేశారు. విచారణలో తేలిందేంటంటే... 330 ప్రయాణికులున్న ఈ విమానంలో ఓ పైలెట్ గుర్రుపెట్టి నిద్రపోయాడు. మరో పైలట్ తన హెడ్‌సెట్‌ను తక్కువ ఫ్రీక్వెన్సీలో పెట్టుకోవడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుంచి సూచనలు సరిగా అందుకోలేకపోయాడు. దీంతో ముంబైనుంచి లండన్ వెళుతున్న 9డబ్ల్యూ 118 విమానానికి సిగ్నల్స్ నిలిచిపోయాయి. దీంతో ఆ విమానం కంటే ముందు ప్రయాణిస్తున్న ఢిల్లీ-లండన్ విమానం (9డబ్ల్యూ 122) ద్వారా అధికారులు ఆ విమానానికి మార్గనిర్దేశం చేశారు.
జెర్మనీ ఏటీసీ నుంచి సమాచారం అందుకున్న ఢిల్లీ విమానం సిబ్బంది 118 విమానం నడుపుతున్న పైలెట్లను శాటిలైట్ ఫోన్ ద్వారా సంప్రదించారు. ఆ తర్వాత కొద్ది సేపటికి 118 సిబ్బంది ముంబై ఏటీసీతో సంబంధాలు పునరుద్ధరించుకోగలిగారు. దాదాపు 15 నిమిషాలకు గానీ పరిస్థితి చక్కబడలేదు. మొత్తం మీద 303 మంది ప్రయాణికులు, 15 మంది విమాన సిబ్బంది సురక్షితంగా బయటపడినందుకు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com