కువైట్‌లో భారతీయ మహిళా నర్సుకి కత్తిపోట్లు దోపిడీ దొంగల ఘాతుకం

- February 22, 2017 , by Maagulf
కువైట్‌లో భారతీయ మహిళా నర్సుకి కత్తిపోట్లు దోపిడీ దొంగల ఘాతుకం

కువైట్: నైట్ డ్యూటీ ముగించుకొని వెళుతున్న 27 ఏళ్ళ ఒక భారతీయ నర్సు పై కొందరు గుర్తు తెలియని  దుండగులు ఆకస్మికంగా దాడి చేశారు. మంగళవారం ఉదయం 8 : 30  సమయంలో జెలీబ్ ఆల్ షోయోముఖ్ ప్రాంతంలో తాను నివసిస్తున్న అపార్ట్మెంట్ రెండవ ఫ్లోర్ ని దాటి వెళుతుండగా కొందరు దుండుగులు   కత్తితో ఆమెపై అకస్మాత్తుగా దాడి చేశారు. ఆమె మొఖంపై , పొట్ట పై ,తొడలపై దారుణంగా పొడిచి ఆమె వద్ద ఉన్న డబ్బును,నగలను దోచుకెళ్లారు. రక్తమోడుతున్న ఆమె దిగువ ఫ్లోర్ కు తూలుతూ వచ్చి తనపై దాడి జరిగినట్లు తెలియచేయడంతో అందరు అప్రమత్తమై పోలీసులను ..అంబులెన్సును అక్కడకి పిలిచేరు.. వెనువెంటనే ఆమెకు శస్త్రచికిత్స జరగడంతో ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు పేర్కొంటున్నారు.  కువైట్‌లో మంగళవారం ఉదయం  జరిగిన ఈ ఘటన స్థానిక ఎన్నారైల్లో భయాందోళనలు రేకెత్తించింది. అబ్బాసియా ప్రాంతంలోని జహ్రా ఆసుపత్రిలో నర్సుగా గత కొంతకాలంగా పనిచేస్తున్న గోపికా శివాజీకుమార్ కేరళలోని కొట్టాయం ప్రాంతానికి చెందినది..  మంగళవారం విధులు ముగించుకుని తన ఫ్లాట్ లోనికి  వెళుతుండగా.. కొందరు దుండగులు ఆమెను అడ్డుకుని డబ్బు ఇవ్వాలంటూ బెదిరించారు. ఆమె భయపడి కేకలు పెట్టడంతో కత్తితో పలుమార్లు ఆమెను  పొడిచి... ఆమె వద్ద ఉన్న బ్యాగు, నగలను దోచుకుని పారిపోయారు. కాగా.. గోపిక పరిస్థితి ప్రస్తుతం  ఫరవాలేదనీ, తొందర్లోనే కోలుకుంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇటీవల కువైట్‌లోని జెలీబ్ ఆల్ షోయోముఖ్ ప్రాంతంలో  భారతీయులు, విదేశీయులపై దోపిడీ దొంగల దాడులు పెరిగిపోతున్నాయి. కొందరు ఎన్నారైలు పోలీసులతో మాట్లాడి సెక్యూరిటీని ఎర్పాటు చేయించుకుంటున్నా ఈ దాడులు ఆగడం లేదు. దోపిడీ దొంగలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు అధికారులు మార్గాలు అన్వేషిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com