రజనీ పుట్టినరోజున "రోబో - 2" !

- September 20, 2015 , by Maagulf
రజనీ పుట్టినరోజున

'ఐ' మూవీ ఫెయిల్యూర్ తరువాత ఆలోచనలో పడ్డ శంకర్ ఫైనల్ గా నెక్ట్స్ సినిమాకు రెడీ అయ్యాడు. చాలా రోజులుగా గాసిప్ గా ఉన్న 'రోబో' సీక్వల్ ను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకురాబోతున్నాడు. రజనీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ అదే స్థాయిలో విజయం సాదించింది. రోబో తరువాత శంకర్ తెరకెక్కించిన 'నన్బన్', 'ఐ' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో కాస్త గ్యాప్ తీసుకున్న శంకర్ పక్కా స్క్రిప్ట్ తో 'రోబో 2'ను రెడీ చేస్తున్నాడు. శంకర్ తో పాటు కోలీవుడ్ స్టార్ రైటర్ జియామోహన్ కూడా గత సమ్మర్ నుంచి 'రోబో 2' స్క్రిప్ట్ పనిలోనే ఉన్నారు. స్క్రిప్ట్ పనులతో పాటు ఇతర వివరాలను కూడా గోప్యంగా ఉంచిన శంకర్ అండ్ టీం. ఫైనల్ గా పక్కా స్క్రిప్ట్ తో రెడీ అయ్యారు. ఇటీవలే ఫుల్ స్క్రిప్ట్ ను తన యూనిట్ సభ్యులకు వినిపించాడట శంకర్. ఈ యూనిట్ లో డైరెక్షన్, ఆర్ట్, విజువల్ ఎఫెక్ట్స్ డిపార్ట్ మెంట్ లకు చెందిన అత్యుత్తమ సాంకేతిక నిపుణులు ఉన్నారు. రజనీ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 12న సినిమాను లాంఛనంగా ప్రారంభించి, కబాలీ షూటింగ్ పూర్తయిన తరువాత రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం కావటంతో ప్రీ ప్రొడక్షన్ పనులకు కూడా చాలా సమయం కేటాయించే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతానికి నటీనటుల ఎంపిక పరంగా రజనీకాంత్ ని తప్ప మరెవరినీ ఫైనల్ చేయని శంకర్, హీరోయిన్ గా దీపిక పదుకొనేను ఎంపిక చేయాలని భావిస్తున్నాడు. ఇతర వివరాలను చిత్రయూనిట్ త్వరలోనే వెల్లిండిచనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com