లులు ఫిల్స్‌ తొలి 24 గంటల బ్రాంచ్‌ ప్రారంభం

- February 28, 2017 , by Maagulf
లులు ఫిల్స్‌ తొలి 24 గంటల బ్రాంచ్‌ ప్రారంభం

మనామా: లులు ఫిల్స్‌ ఇంటర్నేషనల్‌ ఎక్స్‌ఛేంజ్‌ 24 గంటల పాటు పనిచేసే ఔట్‌లెట్‌ని ప్రారంభించింది. లులు ఇంటర్నేషనల్‌ ఎక్స్‌ఛేంజ్‌ ఎల్‌ఎల్‌సికి సంబంధించిన లులు ఫిల్స్‌, ఫిలిప్పీన్స్‌లో ఈ మూడవ బ్రాంచ్‌ని ప్రారంభిస్టున్నట్లు వెల్లడించింది. నినాయ్‌ అక్వినో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ - మనీలాలోని టెర్మినల్‌ 1లో దీన్ని ప్రారంభించారు. ఇది లులు ఇంటర్నేషనల్‌ ఎక్స్‌ఛేంజ్‌కి సంబంధించి 136వ బ్రాంచ్‌. లులు ఫిల్స్‌ ఇంటర్నేషనల్‌ ఎక్స్‌ఛేంజ్‌ ప్రెసిడెంట్‌ మరియు చైర్మెన్‌ ఆఫ్‌ ది బోర్డ్‌ అదీబ్‌ అహ్మద్‌ ఈ బ్రాంచ్‌ని ప్రారంభించారు. ఆర్థిక రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్న దేశాల్లో ఫిలిప్పీన్స్‌ ఒకటని అదీబ్‌ అహ్మద్‌ చెప్పారు. 2014లో ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో లులు ఫిల్స్‌ మెయిన్‌ బ్రాంచ్‌ని ప్రారంభించింది. తాజా బ్రాంచ్‌లో 24 గంటలపాటు పలు సేవలు అందుబాటులో ఉంటాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com