ఘోరంగా పరాజయం పాలైన ఫెదరర్

- March 02, 2017 , by Maagulf
ఘోరంగా పరాజయం పాలైన ఫెదరర్

 

మాజీ ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడు రోజర్‌ ఫెదరర్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 116 స్థానంలో ఉన్న కుర్రాడి చేతిలో పరాజయం పాలయ్యాడు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌ గ్రాండ్‌ స్లామ్‌ పురుషుల సింగిల్స్‌లో విజేతగా నిలిచిన స్విస్‌ స్టార్‌ రోజర్‌కు ఇది ఘోర పరాభవం. దుబాయ్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఇవ్‌జెనీ డాన్‌స్కైయ్‌(రష్యా) చేతిలో 3-6, 7-6(9/7), 7-6(7/5) తేడాతో అతడు ఒటమిని ఎదుర్కొన్నాడు. తొలిసెట్‌ను ఫెదరర్‌ సునాయాసంగా సొంతం చేసుకున్నాడు. రెండు, మూడు సెట్లు టైబ్రేక్‌కు దారితీయడంతో రోజర్‌ను ఓడించిన డాన్‌స్కైయ్‌ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. 2017 సీజన్‌లో వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయం సాధించిన స్విస్‌స్టార్‌ దూకుడుకు డాన్‌స్కోయ్‌ బ్రేక్‌ వేశాడు. ఈ ఛాంపియన్‌షిప్‌కి Joanna MacAdie, Media and PR Manager గా వ్యవహరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com