తెలంగాణా ప్రభుత్వానికి డిజిటలైజేషన్ ప్రక్రియకు గూగుల్ సహకారం

- March 04, 2017 , by Maagulf
తెలంగాణా ప్రభుత్వానికి డిజిటలైజేషన్ ప్రక్రియకు గూగుల్ సహకారం

తెలంగాణా ప్రభుత్వానికి డిజిటలైజేషన్ ప్రక్రియకు గూగుల్ సహకారం అందించనుంది.  స్టార్టప్ కంపెనీలకు సహాయం, యాప్‌లు రూపొందించేలా ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ, గ్రామీణ మహిళలకు డిజిటల్ అక్షరాస్యత లాంటి కార్యక్రమాలు ఇందులో ముఖ్యమైనవి.  ఈ మేరకు గూగుల్ ఇండియా ప్రతినిధుల సమక్షంలో అధికారులు ఒప్పందం చేసుకున్నారు.  యువత, మహిళలు, చిన్న వ్యాపారుల అభివృద్ధికి ఈ ఒప్పందం ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో గూగుల్ ఇండియా డైరక్టర్ చేతన్ కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు. 
గ్రామీణ మహిళలకు ఇంటర్నెట్ సాథి పేరుతో డిజిటల్ అక్ష్యరాస్యత కార్యక్రమాలు చేపడతారు.  సమీప గ్రామాల్లోని మహిళలకు డిజిటల్ అక్షరాస్యతలో శిక్షణ ఇస్తారు. 
రాష్ట్రంలోని పురావస్తు, సాంస్కృతిక శాఖలతో కలిసి పనిచేస్తుంది. పురావస్తు, సాంస్కృతిక చారిత్రక సంపదను డిజిటల్ రూపంలోకి మార్చుతుంది. 
స్థానిక చిన్న, మధ్యతరహా వ్యాపారవేత్తలకు ఆన్‌లైన్ ఆధారిత సేవల కార్యక్రమాలను రూపొందిస్తుంది.
విద్యార్థులకు నైపుణ్య శిక్షణలో భాగంగా ఆండ్రాయిడ్ ప్రాథమిక కోర్సులు గూగుల్ ఇండియా ప్రవేశపెడుతుంది. 
గూగుల్ క్లౌడ్ ఆధారిత ఉత్పత్తులను అర్హత కలిగిన స్టార్టప్ కంపెనీలన్నీ ఉపయోగించుకోవచ్చు. స్టార్టప్‌లకు అవసరమైన సాంకేతిక సలహాలను అందిస్తుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com