నటనకు గుడ్ బై చెప్పి డైరెక్షన్ మీద రవితేజ
- March 04, 2017
ఏడాదిపాటు వెండితెరకు దూరమై ఇప్పుడు మళ్లీ మేకప్ వేసుకుంటోన్న మాస్ మహారాజ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యాడు. ప్రస్తుతం టచ్ చేసి చూడు, రాజా ది గ్రేట్ అనే రెండు సినిమాలు చేస్తున్న రవితేజ ఇక ఎంతోకాలం వెండితెరమీద నటించడన్నది ఇన్నర్ సర్కిల్స్ లో వినిపిస్తున్నమాట. ఇటీవల ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో చేసిన సినిమాలేవీ సరైన విజయాన్ని అందించకపోవడంతో రవితేజ కొత్త ఆలోచనలు చేస్తున్నాడని, నటనకు గుడ్ బై చెప్పి డైరెక్షన్ మీద దృష్టిపెడుతున్నాడని సమాచారం.
రవితేజ నటుడిగా గుర్తింపు తెచ్చుకోకముందే డైరెక్షన్ డిపార్టుమెంట్ లో పని చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చేతిలో ఉన్న రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాత డైరెక్టర్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో తనానేంటో చూపించాలని రవితేజ కసిగానే ఉన్నాడంటున్నారు.
ఇదిలాఉంటే, తాజాగా రవితేజ తన ట్విట్టర్ ఖాతా ద్వారా డైరెక్షన్ చేస్తానని.. అయితే, అది ఎప్పుడో చెప్పలేనంటూ చేసిన వ్యాఖ్యలు వీటికి బలం చేకూరుస్తున్నాయి. నటనలో తనకంటూ ఓ ప్రత్యేకతను చూపించి అందరి అభిమానాన్ని చూరగొన్న రవితేజ, ఇక డైరెక్షన్ ద్వారా ఎలాంటి అద్భుతాలు చేస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







