'పెళ్లిచూపులు' హీరో సారీ చెప్పాడు.

- March 06, 2017 , by Maagulf
'పెళ్లిచూపులు' హీరో సారీ చెప్పాడు.

ఈ మద్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో కొత్త హీరోలు వస్తున్నారు. ఇప్పటికే వారసత్వపు హీరోల హవా కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త హీరోలు తమ టాలెంట్ తో ఇండస్ట్రీలో నెగ్గుకొస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా వస్తున్న హీరోలు నాని, రాజ్ తరుణ్, నిఖిల్ విభిన్నమైన కథలు ఉన్న చిత్రాల్లో నటిస్తూ మంచి హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే కోవలోకి వస్తున్నాడు విజయ్ దేవరకొండ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిన మనోడు తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఈ నెల 3న రిలీజ్ అయిన 'ద్వారక' చిత్రంతో మరోసారి అభిమానుల ముందుకు వచ్చాడు.
అయితే ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా విజయ్ మీడియాతో మాట్లాడుతూ..మా ద్వారక సినిమా కొంతమంది కి నచ్చలేదు , అయితే ఇంకొంతమంది కి నచ్చింది . నచ్చింది అన్న వాళ్లకు థాంక్స్ , నచ్చలేదు అన్నవాళ్ళ కు నా క్షమాపణ లు తెలియజేస్తున్న అన్నాడు.
ఇకముందు తాను నటించబోయే చిత్రాలు అందరినీ ఆకట్టుకునేలా ఉండేలా చూసుకుంటానని అన్నారు. ఇప్పటికే పలు భిన్నమై కథనాలతో హీరోలు తమ టాలెంట్ చూపిస్తూ వస్తున్నారు. ఇక నాని లాంటి హీరో అయితే భలే భలే మగాడివోయ్ చిత్రంతో మొదలు పెట్టిన విజయపరంపర మొన్నటి 'నేను లోకల్ ' వరకు కొనసాగుతూనే ఉంది.
రాజ్ తరుణ్ కూడా నటించింది కొన్ని చిత్రాలే అయినా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు..ఇక హీరో నిఖిల్ కూడా భిన్నమైన కథనాలు ఉన్న చిత్రాల్లో నటిస్తూ మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. త్వరలో 'అర్జున్ రెడ్డి' సినిమాతో అభిమానుల ముందుకు వస్తున్నాడు. ఇకపై నేను చేసే ప్రతీ సినిమా కూడా దేనికి పొంతన లేకుండా విభిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తానని చెబుతున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com