జయలలిత మెడికల్ రిపోర్టు ప్రభుత్వం చేతిలో
- March 06, 2017
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చికిత్సపై ఢిల్లీ ఎయిమ్స్ తమ వైద్యులు సమర్పించిన నివేదికను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. జయలలితకు చికిత్స అందించేందుకు ఐదు సార్లు చెన్నై వచ్చిన ఎయిమ్స్ వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిపై జరిపిన విశ్లేషణ ఈ నివేదికలో ఉంది. తమిళనాడు ప్రభుత్వం తమ అధికారిక రికార్డుల కోసం ఎయిమ్స్ వైద్యుల విజిట్ నోట్స్ అడిగిందని... సదరు పత్రాలను తమిళనాడు ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జే రాధా కృష్ణన్‌కు అప్పగించినట్టు ఎయిమ్స్ డిప్యూటీ డైరెక్టర్ (ఆడ్మిష్ట్రేషన్) వి శ్రీనివాస్ వెల్లడించారు. కాగా జయలలితకు చికిత్స అందించే విషయంలో కుట్ర జరిగిందంటూ మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చేసిన ఆరోపణలను తమిళనాడు ప్రభుత్వం ఖండించింది.
జయలలిత మృతిపై విచారణ జరపాలంటూ ప్రతిపక్ష డీఎంకే సైతం మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఇదే విషయంపై పన్నీర్ సెల్వం మద్దతుదారులైన ఎంపీలు రాష్ట్రపతిని కలిసి 'అమ్మ' మృతిపై విచారణ జరిపించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఎయిమ్స్ వైద్యుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక తెప్పించుకోవడం ఆసక్తిని రేకెత్తించింది.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!