అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 24 మంది మహిళలకు పురస్కారాలు

- March 06, 2017 , by Maagulf
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 24 మంది మహిళలకు పురస్కారాలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో కృషి చేసిన 24 మంది మహిళలను పురస్కారాలు వరించాయి.  సామాజిక సేవ, విద్య, వ్యవసాయం, సాహిత్యం, వృత్తి సేవలతో పాటు వివిధ రంగాల్లో నిర్విరామంగా కృషి చేసిన వారితో పాటు తెలంగాణా మహిళా ఉద్యమకారిణిలకు ప్రభుత్వం పురస్కారాలు ప్రకటించింది.  తెలంగాణా ఉద్యమ పాటలు రాసిన ఇద్దరికి, పాత్రికేయ రంగంలో ముగ్గురికి పురస్కారాలు వరించాయి. వందశాతం నగదు రహిత లావాదేవీల్లో కృషికి 2 గ్రామ పంచాయితీల సర్పంచ్‌లకు అవార్డులను ప్రకటించారు.  ఈ 24 మంది మహిళలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సత్కరించనున్నది. 
విద్యారంగం : డాక్టర్ విద్యావతి (వరంగల్)
సామాజిక సేవ : జానకి (హైదరాబాద్) దేవకీదేవి (మహబూబ్ నగర్), గాయత్రి (వనపర్తి),లక్ష్మీబాయి (ఆదిలాబాద్)
వ్యవసాయం : సుగుణమ్మ (జనగామ) నాగమణి (నల్గొండ)
తెలంగాణా ఉద్యమకారులు  : మణమ్మ(ఉప్పల్), డి. స్వప్న (హైదరాబాద్), ఎం. విజయారెడ్డి (పెద్దపల్లి) 
వృత్తి సేవలు  : ప్రమీల న్యాయవాది (మంచిర్యాల)
సాహిత్యం : రజిత (వరంగల్), షాజహాన (ఖమ్మం)
నృత్యం :  వనజా ఉదయ్ (హైదరాబాద్)
చిత్రలేఖనం : అంజనీరెడ్డి (జహీరాబాద్)
సంగీతం : పాయల్ కొట్గరీకర్ (నిజామాబాద్) 
తెలంగాణా ఉద్యమ పాటలు  : చైతన్య (నల్లగొండ), స్వర్ణ (కరీంనగర్) 
క్రీడలు : ప్రియదర్శిని (వరంగల్)  
పాత్రికేయ రంగం :సత్యవతి (హైదరాబాద్) కట్టా కవిత (నల్గొండ), జి.మల్లీశ్వరి (వరంగల్) 
సర్పంచ్‌లు  : ఎం.పద్మ (కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామం) కె.లక్ష్మీ(సిద్దిపేట జిల్లా ఇబ్రహీం పూర్ గ్రామం)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com