అల్ రయ్యాన్ అల్ జదీద్ స్ట్రీట్‌పై 9 రోజుల 'క్లోజర్'
- March 06, 2017
పబ్లిక్ వర్క్స్ అథారిటీ - అష్గల్, అల్ రయ్యాన్ అల్ జదీద్ రోడ్‌పై ప్రధానమైన 'క్లోజర్'ని ప్రకటించింది. మార్చ్ 9 నుంచి తొమ్మిది రోజులపాటు ఈ క్లోజర్ అమల్లో ఉంటుంది. అస్ఫాల్ట్ చివరి పనుల్ని ప్రధాన ఇంటర్‌ఛేంజెస్ వద్ద పూర్తి చేయడం కోసం ఈ క్లోజర్‌ని ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. కొత్త ఇంటర్‌ఛేంజ్‌లు ట్రాఫిక్ని మరింత మెరుగ్గా మార్చుతాయని వారు పేర్కొంటున్నారు. మార్చ్ 18న క్లోజర్‌ని ఎత్తివేస్తారు. ఆ తర్వాత ఈ రోడ్డుపై వాహనాలు ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు వెళతాయని ఆశిస్తున్నారు. అల్ రయ్యాన్ అల్ జదీద్ స్ట్రీట్, అల్ కలా స్ట్రీట్, అల్ బుసాయెర్ స్ట్రీట్ తదితర రోడ్లపై కొన్ని ప్రాంతాల్లో ఈ క్లోజర్ అమల్లో ఉంటుంది. వాహనదారులు, తమ వాహనాల్ని ఈ రోడ్లమీదుగా నడపాలనుకుంటున్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాలపై సూచికలు ఏర్పాటు చేసి, మ్యాప్‌ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- జులీబ్, షువైఖ్ పారిశ్రామిక ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్..!!
- గాజా కోసం అమెరికా శాంతి ప్రణాళిక..మొదటి దశపై బహ్రెయిన్ ప్రశంసలు..!!
- సముద్ర నావిగేషన్‌ను పునఃప్రారంభించిన ఖతార్..!!
- జాయెద్ ఇంటర్నేషనల్‌లో డిజిటల్ టూరిస్ట్ వాలెట్ ప్రారంభం..!!
- ప్రమాద బాధితుల వీడియో రికార్డ్..ఒమన్‌లో వ్యక్తి అరెస్టు..!!
- మక్కాలో మహిళలపై వేధింపులు..ఆఫ్ఘన్ జాతీయుడు అరెస్టు..!!
- అమెరికన్ ప్రతినిధుల బృందంతో సీఎం భేటీ..
- ఏపీ: త్వరలో భారీగా పోలీస్ నియామకాలు..
- ట్రాన్స్జెండర్ల వేధింపులపై ట్వీట్: సీపీ సజ్జనార్
- చంద్రబాబు పేదవాడికి భవిష్యత్ లేకుండా చేస్తున్నారు – జగన్