ఐసీసీ మహిళల వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్‌గా లిటిల్ మాస్టర్
- March 08, 2017
ఐసీసీ మహిళల వరల్డ్ కప్ అఫీసియల్ బ్రాండ్ అంబాసిడర్‌గా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను ఎంపిక చేసినట్లు ఐసీసీ తన అధికారిక ట్విట్టర్‌లో పేర్కొంది. మార్చి 8 (అంతర్జాతీయ మహిళా దినోత్సవం)ను పురస్కరించుకుని క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ మైదానంలో మహిళల వరల్డ్ కప్ 2017 షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది.
ఈ సందర్భంగా ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్‌సన్ మీడియాతో మాట్లాడారు. మహిళల వరల్డ్ కప్ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయడానికి మార్చి 8 సరైన రోజని భావించామని ఆయన అన్నారు.
అదే విధంగా బుధవారం (మార్చి 8) మధ్యాహ్నం నుంచి గ్రూప్ స్టేజీ మ్యాచ్ టికెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన తెలిపారు.
ఇదిలా ఉంటే మహిళల వరల్డ్ కప్ టోర్నీ జూన్ 24 నుంచి జులై 23 వరకు జరగనుంది. 21 రోజుల్లో 28 మ్యాచ్‌లను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
జులై 23న క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టోర్నీలో భాగంగా జూన్ 24న డెర్బీ వేదికగా భారత మహిళల జట్టు ఇంగ్లాండ్‌తో తలపడనుంది. బ్రిస్టల్ వేదికగా
న్యూజిలాండ్‌తో శ్రీలంక తలపడనుంది.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!