'కంట్రీ క్లబ్ రంగ్‌ బర్సే 2017' ప్రెస్ కాన్ఫరెన్స్

- March 09, 2017 , by Maagulf

కంట్రీ క్లబ్‌ రంగ్‌ బర్సే 2017 పేరుతో హోలీ ఫెస్టివల్‌ని అంగంగ వైభవంగా నిర్వహించనుంది. మార్చ్‌ 10న జబీల్‌ పార్క్‌, గేట్‌ 5, ఏరియా సి, దుబాయ్‌లో ఉదయం 10 గంటల నుంచి ఈ వేడుకలు జరగనున్నాయి. ప్రముఖ పంజాబీ సింగర్స్‌ అల్‌ఫాజ్‌, అడ్రీ మరియు రియాల్టీ డాన్స్‌ షో విన్నర్‌ సయాలీ పరాద్కర్‌ తదితరులు ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణ కానున్నారు. ప్రముఖ డీజేలు కిప్స్‌, మెగన్‌, తన్మయ, ఇండియన్‌ స్లాప్‌, మయాంక్‌, గిగా తదితరులు బాలీవుడ్‌ డాన్స్‌ గ్రూప్‌ డి-డాన్స్‌తో కలిసి ఈ ఈవెంట్‌ని మరింత కలర్‌ఫుల్‌గా మార్చనున్నారు. 105.4 ఎఫ్‌ఎఫ్‌ఎం ఆర్‌జె ఈ కార్యక్రమాన్ని హోస్ట్‌ చేయనున్నారు. అలాగే మాజీ మిస్‌ ఇండియా సిమ్రాన్‌ ఆహుజా మరో హోస్ట్‌గా వ్యవహరిస్తారు. కంట్రీ క్లబ్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌రెడ్డి మాట్లాడుతూ, ఈ వేడుకని విజయవంతం చేయాలని ఆహూతులకు విజ్ఞప్తి చేశారు. కనీ వినీ ఎరుగని స్థాయిలో వేడుకల్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారాయన. ఈ కార్యక్రమానికి హాజరయ్యేవారికోసం ఒక్కో వ్యక్తికి 65 అరబ్‌ ఎమిరేట్స్‌ దినార్స్‌ని, అలాగే జంటకు 115, నలుగురి బృందానికి 200 అరబ్‌ ఎమిరేట్స్‌ దిర్హామ్‌ని ఫీజుగా నిర్వహించారు. కంట్రీ క్లబ్‌ మెంబర్స్‌కి కేవలం 50 అరబ్‌ ఎమిరేట్స్‌ దినార్స్‌తోనే ఎంట్రీ లభిస్తుంది. ఐదేళ్ళలోపు వయసున్నవారికి ఉచిత ప్రవేశం. ప్లాటినమ్‌ టిక్కెట్స్‌, యూఏఈ ఎక్స్‌ఛేంజ్‌, బికనీర్‌వాలా ఔట్‌లెట్స్‌ వద్ద టిక్కెట్లు లభ్యమవుతాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com