నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం 26 మంది మృతి
- March 09, 2017
నేపాల్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 26 మంది మరణించగా, మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. నేపాల్ రాజధాని ఖాట్మాండుకు పశ్చిమాన 400 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు చెప్పారు.
గురువారం కిక్కిరిసిన ప్రయాణికులతో, పర్వత ప్రాంతంలో ఇరుకైన రహదారిలో వెళ్తున్న బస్సు అదుపు తప్పింది. దాదాపు 200 మీటర్ల దిగువకు బస్సు దొర్లుకుంటూ వెళ్లి నదిలో పడింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, సైనికులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను కాపాడి వారిని హెలికాప్టర్లలో నేపాల్ గంజ్‌లోని ఆస్పత్రికి తరలించారు.
శుక్రవారం ఉదయం మరి కొంతమంది క్షతగాత్రులను రక్షించారు. సహాయక చర్యలకు ప్రతికూల వాతావరణం ఆటంకం కలిగించింది. నేపాల్ లో పర్వత ప్రాంతాల్లో రోడ్డు ఇరుకుగా ఉండటం, బస్సులు కండీషన్లో లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







