డిఫేమేషన్పై కొత్త చట్టం
- March 10, 2017ఎమిర్ ఆఫ్ ఖతార్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ తని, లా నెంబర్ 4, 2017ను జారీ చేశారు. 2004, నెంబర్ 11 చట్టానికి కొన్ని సవరణలు చేస్తూ కొత్త చట్టం తీసుకువచ్చారు. ఇతరుల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడటం, వారి వ్యక్తిగత విషయాల్ని బయటపెట్టడం వంటి నేరాలకు కఠినమైన చర్యల్ని ఈ చట్టంలో పేర్కొన్నారు. ఈ నేరానికిగాను 2 ఏళ్ళకు పైగా జైలు శిక్ష, అలాగే 10,000 ఖతారీ రియాల్స్ వరకు జరీమానా విధించేలా చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
ఇందులో, ఓ వ్యక్తికి చెందిన లెటర్ని ఆయన అనుమతి లేకుండా ఓపెన్ చేయడం, ఇతరుల టెలిఫోన్ సంభాషణను తెలుసుకోవడం, రికార్డ్ చేయడం, ఇంకొకరికి అందులో వివరాల్ని తెలియజేయడం, ఏ పరికరాన్నయినా ఉపయోగించి ఇతరుల వ్యక్తిగత ఫొటోల్ని తీసి, ప్రచారం చేయడం ఇందులో ముఖ్యమైన అంశాలు. వీటికి కఠినమైన శిక్షలుంటాయి. ప్రమాదాల్లో గాయపడ్డవారి ఫొటోలు లేదా వీడియోల్ని ప్రచారం చేసినా అవే శిక్షలు అమలవుతాయి.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







