పైలట్ అవతారమెత్తిన చిరు !
- September 24, 2015
తన 150వ సినిమా కోసం రంగంలోకి దిగబోతున్నారు చిరంజీవి. తనయుడు చరణ్‌తో కలిసి 'బ్రూస్లీ'లో ఆడిపాడబోతున్నారు. చాలా రోజుల తర్వాత చిరంజీవి కెమెరా ముందుకొస్తుండటంతో అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి ప్రతీ కదలిక గురించి తెలుసుకొంటున్నారు. ఇంతలో ఆయన ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. ఓ ఫొటోలో ఫ్త్లెట్ ఫైలట్ అవతారంలో కనిపిస్తున్నారు. అది చూసిన అభిమానులు చిరు పైలట్ ఎందుకయ్యారు? అని ఆరా తీస్తున్నారు. కొత్త సినిమాకోసమే పైలట్‌గా తర్ఫీదు పొందుతున్నారేమో అని భావిస్తున్నారు. ఆ స్టిల్ నెట్లో వైరల్ అవుతోంది కానీ... అందుకు సంబంధించిన పక్కా సమాచారం మాత్రం బయటికి రాలేదు. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ ట్రూ జెట్ పేరుతో విమానయాన సంస్థని నడుపుతున్నాడు. తన కొడుకుకి సంబంధించిన ఫ్త్లెట్లో కూర్చుని అలా పోజిచ్చారా లేక నిజంగానే పైలట్‌గా మారారా అన్నది తెలియాల్సి వుంది. 'బ్రూస్లీ' కోసం త్వరలోనే సెట్లోకి అడుగుపెట్టబోతున్నారు చిరంజీవి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









