ఎమిర్‌, ఎమిర్‌ తండ్రి ఈద్‌ ప్రార్థనలు

- September 25, 2015 , by Maagulf
ఎమిర్‌, ఎమిర్‌ తండ్రి ఈద్‌ ప్రార్థనలు

ఎమిర్‌షేక్‌ తమీమ్‌ బిన్‌ హమద్‌ అల్‌ థానీ, మరియు ఆయన తండ్రి ఎమిర్‌ షేక్‌ హమద్‌ బిన్‌ ఖలీఫా అల్‌ థానీ గురువారం ఉదయం అల్‌ వజ్బా వద్ద ఈద్‌ ప్రార్థనలు నిర్వహించారు. డిప్యూటీ ఎమిర్‌ షేక్‌ అబ్దుల్లా బిన్‌ హమద్‌ అల్‌ థని, షేక్‌ అబ్దుల్లా బిన్‌ ఖలీఫా అల్‌ థని మరియు షేక్‌ మహ్మద్‌ బిన్‌ ఖలీఫా అల్‌ థని మరికొందరు షేక్‌లు, మంత్రులు, రాయబారులు, పెద్ద సంఖ్యలో పౌరులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనల్ని నడిపించిన డాక్టర్‌ థకీల్‌ సేయర్‌ అల్‌ షమ్మరి, అసాంఘీక శక్తుల్ని తరిమికొట్టి, ఇస్లాం దేశాల మధ్య ఐక్యతను పెంపొందించాలనీ, ఇస్లాం ధర్మాన్ని ప్రతి ముస్లిం పాటించాలనీ, ప్రార్థనా మందిరాల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలనీ పిలుపునిచ్చారు. అల్‌ అథా సందర్భంగా ఎమిర్‌, ఈద్‌ అల్‌ అధా ప్రార్థనలు విజయవంతంగా జరిగాయనీ, ఈ ప్రార్ధనల్ని సజావుగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com